Monday, February 24, 2014

గొప్ప తెలంగాణను నిర్మించుకుందాం...

రాబోయే కాలంలో కష్టాలు లేని తెలంగాణను తయారు చేసుకుందామని, దీనికి మేధావులు, ఆలోచనపరులు కలిసి రావాలని సిపిఎం మాజీ శాసనసభాపక్ష నాయకులు నోముల నర్సింహయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక వర్తకసంఘంలో ఆయన విలేకర్లతో ప్రసంగించారు. ప్రతి వ్యక్తీ సగటు ఆదాయం పెరిగే విధంగా తెలంగాణను తయారు చేసుకోవాలని కోరారు. తెలంగాణలో వ్యవసాయం 70శాతం విద్యుత్తుపై ఆధారపడి ఉందన్నారు. 9 గంటల నిరంతర విద్యుత్తు ఇవ్వడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. చంద్రబాబు, వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లెజిస్లేటివ్స్‌, ఎగ్జిక్యూటీవ్స్‌ అంకితభావంతో పనిచేస్తే తప్ప తెలంగాణకు మేలు జరుగదన్నారు. ఈ సమావేశంలో సింగిల్‌విండో ఛైర్మన్‌ సుర్కంటి వెంకట్‌రెడ్డి, జిఎంపిఎస్‌ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, నాయకులు మందుల వెంకటయ్య, దయ్యాల నర్సింహా, రాసాల వెంకటేశ్‌, బండారు మల్లేశ్‌, బుడుమ శ్రీశైలం, మద్దెపురం బాలనర్సింహా, బల్లి సంతోశ్‌ పాల్గొన్నారు.